‘తోర్’ కొండల్లాంటి కండల వెనుక రహస్యం… వీడియో షేర్ చేసిన సూపర్ హీరో!

మామూలు హీరోలే ఈ మధ్య సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్స్ ప్రదర్శిస్తున్నారు! మరి సూపర్ హీరోల సంగతేంటి? ‘తోర్ : గాడ్ ఆఫ్ థండర్’ లాంటి అరివీర భయంకరుడి మాటేంటి? ఖచ్చితంగా కండలు తిరిగిన కళాకృతితో కళ్లు పెద్దవయ్యేలా కనిపించాలి! అదే చేశాడట హాలీవుడ్ సూపర్ స్టార్ క్రిస్ హెమ్స్ వర్త్!
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ తో పరిచయం ఉన్న అందరికీ ‘తోర్’ తెలిసే ఉంటాడు. థండర్ గాడ్ గా ఆయన శక్తి అపారం. మరి అటువంటి మహా బలవంతుడైన సూపర్ హీరో ఎలా ఉండాలి? భారీగా ఉండాలి. ఆ కారణంతోనే తన రాబోయే ‘తోర్’ మూవీ సీక్వెల్ కోసం బాగా కండ పట్టాడు క్రిస్ హెమ్స్ వర్త్. అయితే, ఇప్పుడు తన పాత్ర కోసం తాను పడ్డ శ్రమనంతా నెటిజన్స్ తో షేర్ చేసుకోవాలని భావిస్తున్నాడు టాలెంటెడ్ యాక్టర్. ఇన్ స్టాగ్రామ్ లో ఓ వర్కవుట్ వీడియో షేర్ చేసిన ఆయన ‘ఈట్, ట్రైన్, స్లీప్, రిపీట్’ అంటూ ఫార్ములా కూడా చెప్పాడు. అయితే, 2022లో విడుదలయ్యే ‘తోర్ : లవ్ అండ్ థండర్’ మూవీ కోసం తన జీవితంలోనే అత్యుత్తమమైన ఫిజిక్ సంపాదించానని గర్వంగా చెప్పాడు క్రిస్. వీడియో చూస్తే మనకూ ఆ విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఆయన కండలు కెమెరా లెన్సుల్లో ఇమడవేమో అన్నంతగా పెల్లుబుకుతున్నాయి!
‘తోర్ : లవ్ అండ్ థండర్’ సినిమా కోసం తనకి ఎంతగానో హెల్ప్ చేసిన ‘సెంటర్ ఫిట్’ ట్రైనర్స్ తో కలసి క్రిస్ హెమ్స్ వర్త్ ఓ ఆన్ లైన్ ప్రొగ్రామ్ మొదలు పెట్టబోతున్నాడు. 7 డేస్ ఫ్రీ ట్రయల్ కోసం రిజిస్టర్ కూడా చేసుకొమ్మంటూ పిలుపునిచ్చాడు. ఆ తరువాత రెగ్యులర్ ‘సెంటర్ ఫిట్’ యాప్ ద్వారా ఈ సూపర్ హీరో వర్కవుట్ సీక్రెట్స్ సామాన్యులు కూడా తెలుసుకోవచ్చట! ‘తోర్’ తోడుగా ఉంటానంటే ఎవరైనా వద్దంటారా చెప్పండి? క్రిస్ పరిచయం చేసిన ఫిజక్ అండ్ ఫిట్నెస్ యాప్ కి భారీ రెస్పాన్స్ ఉండవచ్చని చాలా మంది అంచనాలు వేస్తున్నారు. లెట్స్ సీ…

View this post on Instagram

A post shared by Chris Hemsworth (@chrishemsworth)

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-