“గాడ్ ఫాదర్” కోసం రంగంలోకి హాలీవుడ్ పాప్ సంచలనం

మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ “గాడ్ ఫాదర్” షూటింగ్ ప్రారంభమైంది. మలయాళ బ్లాక్ బస్టర్ డ్రామా లూసిఫర్ కు రీమేక్ గా ఈ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించారు. ‘గాడ్‌ ఫాదర్’ చిత్రం టైటిల్, ప్రీ, లుక్ ను ఇటీవల చిరంజీవి పుట్టిన రోజున విడుదల చేసింది. ఇందులో ఆయన రెట్రో అవతార్‌లో కనిపించబోతున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ‘గాడ్‌ఫాదర్’ను ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, కొణిదెల సురేఖ సమర్పకురాలుగా ఉన్నారు. మీడియాలో ఫిల్మ్ ఇండస్ట్రీలో నడుస్తున్న బజ్ ప్రకారం హాలీవుడ్ పాప్ సెన్సేషన్ బ్రిట్నీ స్పియర్స్ ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా ‘గాడ్‌ఫాదర్‌’లో మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక పాట పాడతారు.

Read Also : పూజాహెగ్డేకు ‘రాధేశ్యామ్’ బర్త్ డే విషెస్

‘గాడ్‌ఫాదర్’ మేకర్స్ చిరంజీవి సినిమాలో ఒక పాట పాడటానికి బ్రిట్నీ స్పియర్స్‌ని తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. ఇక బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో సహాయక పాత్రలో కనిపించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాకు నీరవ్ షా సినిమాటోగ్రఫీ, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

-Advertisement-"గాడ్ ఫాదర్" కోసం రంగంలోకి హాలీవుడ్ పాప్ సంచలనం

Related Articles

Latest Articles