వైరల్ అవుతున్న ‘కోవిడ్’.. కానీ వైరస్ కాదండోయ్…!!

ప్రస్తుతం కోవిడ్ అనే పేరు వింటేనే జనాలు హడలెత్తిపోతున్నారు. 2020 తర్వాత ప్రపంచ వ్యాప్తంగా తిట్టుకునే పేర్లలో కచ్చితంగా కోవిడ్ ఉండి తీరుతుంది. కానీ కోవిడ్ అనే పేరు మనుషులకు ఉంటుందని మనం ఊహించగలమా? అయితే మన ఇండియాలో కోవిడ్ అనే పేరు గల మనిషి ఉన్నాడండోయ్. అతడి పూర్తి పేరు కోవిడ్ కపూర్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ముంబై ఐఐటీలో చదువుకున్న కోవిడ్ కపూర్ ప్రస్తుతం బెంగళూరులోని ట్రావెల్ కంపెనీ హాలిడిఫై.కామ్ సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్నారు.

Read Also: మనిషిని నాశనం చేసే ఐదు విషపూరిత అలవాట్లు

తన తల్లిదండ్రులు తనకు చిన్నప్పుడే కోవిడ్ అని పేరు పెట్టారని… హనుమాన్ చాలీసాలో కోవిడ్ అనే పదం ఉంటుందని… కోవిడ్ అంటే విద్వాంసుడు లేదా అన్ని తెలిసిన వ్యక్తి అని అర్థం వస్తుందని కోవిడ్ కపూర్ వివరించారు. చైనాలో పుట్టిన వైరస్‌కు కోవిడ్ అని పేరు పెట్టిన తర్వాత దాని అర్థమే మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా కోవిడ్ కపూర్ అని పేరు చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా స్పందించిన కోవిడ్ కపూర్ ‘ నాపేరు కోవిడ్. కానీ నేను వైరస్‌ను కాదు’ అంటూ ట్యాగ్‌లైన్ రాసుకున్నారు. ఇటీవల తాను విదేశాలకు వెళ్లినప్పుడు తన పేరు విని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారని… జోకులు వేసుకున్నారని కోవిడ్ కపూర్ గుర్తుచేసుకున్నారు.

Related Articles

Latest Articles