బిగ్‌ న్యూస్‌: ఈ నెల 8 నుంచి 16వరకు తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు

ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా విజృంభన మొదలైంది. అయితే ఇప్పటికే పలు దేశాల్లో ఆంక్షలు విధించారు. అయితే తాజాగా భారత్‌లోకి ప్రవేశించిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కూడా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే కరోనా, ఒమిక్రాన్‌ కేసులు రోజురోజుకు తెలంగాణలో పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు, ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్​ సమావేశమయ్యారు.

వైద్యారోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తి తదితర అంశాలపై సమీక్షించారు. అంతేకాకుండా రాష్ట్రం లోని అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 8 తేదీ నుంచి 16 తేదీ వరకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అయితే ఈ సెలవుల్లోనే సంక్రాంతి సెలవులు కూడా ఇచ్చినట్టే. అంతేకాకుండా ఈ సెలవుల ముగిసే లోపు కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరిగితే సెలవులు మరిన్ని రోజులు పొడిగించే అవకాశం ఉంటుందని సమాచారం.

Related Articles

Latest Articles