రేపు తెలంగాణలో వ్యాక్సిన్‌కు హాలిడే..

కరోనా మహమ్మారికి చెక్‌ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌.. దీంతో.. దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వం.. ఇక, తెలంగాణలో మొదటల్లో వ్యాక్సిన్‌ లేక కొన్ని రోజులు వ్యాక్సిన్‌కు హాలిడేస్‌ ప్రకటించినా.. ఆ తర్వాత క్రమంగా వ్యాక్సినేషన్‌లో వేగం పుంజుకుంది.. ఫస్ట్‌ డోస్‌ కొనసాగిస్తూనే.. ఫస్ట్‌ డోస్‌ తీసుకుని.. సెకండ్‌ డోస్‌ వేసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నవారిపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది ప్రభుత్వం.. అయితే, పండుగ సమయంలోనూ వ్యాక్సిన్‌కు హాలిడే ఇస్తూ వస్తున్నారు.. రేపు దీపావళి (నవంబర్‌ 4వ తేదీ) సందర్భంగా తెలంగాణలో వ్యాక్సిన్‌కు హాలిడే ప్రకటించారు అధికారులు.. ఎల్లుండి నుంచి యథావిథిగా వ్యాక్సినేషన్‌ కొనసాగుతుందని చెబుతున్నారు వైద్యారోగ్యశాఖ అధికారులు.

Related Articles

Latest Articles