హిమేశ్ రేషమియా న్యూ ఆల్బమ్ ‘సురూర్ 2021’… ఆ ‘మిస్టీరియస్ గాళ్’ ఎవరు?

బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హిమేశ్ రేషమియా మరోకొత్త ఆల్బమ్ తో రాబోతున్నాడు. త్వరలోనే తన సరికొత్త ఆల్బమ్ ‘సురూర్ 2021’కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నాడు. ఆయన అప్ కమింగ్ పోస్టర్ లో క్యాప్ అండ్ మైక్ తో కనిపించబోతున్నాడట! హిమేశ్ రేషమియా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఆయన ఐకానిక్ క్యాప్ అండ్ మైక్ పెద్ద క్రేజ్! నెత్తిన టోపీ పెట్టుకుని… మైక్ ని అలా గాల్లోకి పైకెత్తి… హై పిచ్ లో పాటలు పాడేవాడు, టాలెంటెడ్ మ్యుజీషియన్!
సినిమాల్లో పాటలు కాకుండా హిమేశ్ రూపొందించిన ఫస్ట్ స్టూడియో ఆల్బమ్ ‘ఆప్ కా సురూర్’. అప్పట్లో అది 55 మిలియన్ కాపీలు అమ్ముడుపోయిందంటారు! మైకెల్ జాక్సన్ ‘థ్రిల్లర్’ ఆల్బమ్ 65 మిలియన్లతో నంబర్ వన్ గా ఉండేది. దాని తరువాత ఈ మెలోడియస్ మ్యూజిక్ మాస్టర్ దే రెండో స్థానం!

ఇప్పటికే వందల కొద్దీ పాటలు సంగీత ప్రియులకి అందించిన హిమేశ్ గత ఆల్బమ్ లో దీపికా పదుకొణేతో కలసి ఆడియన్స్ ముందుకొచ్చాడు. మరి ఈసారి ‘సురూర్ 2021’ ఆల్బమ్ గాళ్ ఎవరు? ఇంకా సస్పెన్సే! ఆమె ఎవరో త్వరలోనే తెలిసే చాన్స్ ఉంది. న్యూ గాళ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయట. చూడాలి మరి, ‘సురూర్ 2021’ ఫస్ట్ లుక్, టీజర్, ఆల్బమ్… ఇవన్నీ రానున్న రోజుల్లో ఎలా అలరిస్తాయో! తన పాటలు మెలోడీ, ఒరిజినాలిటితో మనసుకు ప్రశాంతత కలిగిస్తాయని, ప్రస్తుతం ఉన్న సంక్షోభ స్థితిలో స్ట్రెస్ బస్టర్స్ గా ఉంటాయని హిమేశ్ రేషమియా చెబుతున్నాడు! లెట్స్ వెయిట్, వాచ్ అండ్ హియర్…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-