హిమాయత్ సాగర్ మరో రెండు గేట్ల మూసివేత

హిమాయత్ సాగర్ మరో రెండు గేట్లను మూసివేశారు. గడచిన రెండు రోజుల నుండి వర్షపాతం తగ్గినందువల్ల.. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట)లకు ఎగువ నుండి వచ్చే వరద నీటి ఉద్ధృతి తగ్గింది. దీంతో తగినంత ఇన్ ఫ్లో లేని కారణంగా .. ఉన్నతాధి కారుల సూచనల మేరకు ఈ రెండు జలాశయాల గేట్లను జలమండలి అధికారులు నిన్న మూసివేసారు. నేడు ఈ వరద ప్రవాహం మరింత తగ్గు ముఖం పట్టడంతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ యొక్క మరో రెండు గేట్లను ఈ రోజు మూసివేసారు. దీంతో ఇప్పటివరకు ఈ రిజర్వాయర్ మూడు గేట్ల ద్వారా 343 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న మూసీ నదిలోకి వదులుతున్నారు.

హిమాయత్ సాగర్ వివరాలు :
హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం : 1763.50 అడుగులు
ప్రస్తుత నీటి స్థాయి : 1761.75 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 2.968 టీఎంసీ లు
ప్రస్తుత సామర్థ్యం : 2.562 టీఎంసీ లు
ఇన్ ఫ్లో :400 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో: 343 క్యూసెక్కులు
మొత్తం గేట్ల సంఖ్య: 17 గేట్లు
ఎత్తిన గేట్ల సంఖ్య: 3 గేట్లు

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-