కోవిడ్ వ్యాక్సినేష‌న్‌: టాప్‌లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌…

దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా కొన‌సాగుతున్న‌ది.  క‌రోనాకు చెక్ పెట్టాలంటే వ్యాక్సిన్ తీసుకోవ‌డం ఒక్క‌డే మార్గం కావ‌డంతో వ్యాక్సినేష‌న్‌ను జోరుగా అందిస్తున్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపుగా 40 కోట్ల మందికి వ్యాక్సిన్ ను అందించారు.  అయితే, దేశంలో అత్య‌ధిక వ్యాక్సినేష‌న్ అందించిన రాష్ట్రాల్లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ మొద‌టిస్థానంలో ఉన్న‌ది.  హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో 18 ఏళ్లు దాటిన వారిలో 61.1శాతం మందికి వ్యాక్సిన్ అందించింది.  హిమాచ‌ల్ ప్ర‌దేశ్ మొద‌టి స్థానంలో ఉంటే, దేశ రాజ‌ధాని ఢిల్లీ రెండో స్థానంలో ఉన్న‌ది.  ఢిల్లీలో 45.4 శాతం మంది జ‌నాభాకా మొద‌టి డోస్ వ్యాక్సిన్ పూర్తి చేశారు.  44.4 శాతం వ్యాక్సినేష‌న్‌తో గుజ‌రాత్ మూడో స్థానంలో ఉంది.  

Read: అరవై ఏళ్ళ ‘శాంత’

ఇక టీకాలు వేసే విష‌యంలో పెద్ద రాష్ట్రాలైన యూపీ, బీహార్ ఉన్నాయి.  బీహార్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 22 శాతం మంది జ‌నాభాకు మాత్ర‌మే వ్యాక్సిన్ వేయ‌గా, యూపీలో 21.5 శాతం మంది జనాభాకు మాత్ర‌మే వ్యాక్సిన్ వేశారు.  ఇక దేశ వ్యాప్తంగా చూసుకుంటే, ఇండియాలో 30.87 కోట్ల మందికి మొద‌టి డోసు వ్యాక్సిన్ ఇవ్వ‌గా, 7.62 కోట్ల మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు.  దేశంలో మొత్తం 38.50 కోట్ల మంది ప్ర‌జ‌లు టీకాలు తీసుకున్న‌ట్టు ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-