కుప్పంలో టెన్షన్… ముఖ్య నేతల ముందస్తు హౌస్ అరెస్ట్

కుప్పంలో టెన్షన్ వాతారవరణం నెలకొంది. కుప్పంలో ఇవాళ శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ర్యాలీకి పిలుపునిచారు బలిజ సామాజిక వర్గం నేతలు. కానీ ఆ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పోలీసులు అడ్డుకున్నా ర్యాలీ నిర్వహించి తీరుతామని బలిజ సామాజిక వర్గ పెద్దలు ప్రకటించారు. దాంతో గత రాత్రి నుంచి ముఖ్య నేతలను ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. శ్రీ కృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఉంచిన శ్రీ మంజునాథ రెసిడెన్సి వద్ద 50 మందికి పైగా పోలీసులను మోహరించారు. ప్రధాన కూడళ్ల వద్ద పహారాలో 200 మందికి పైగా పోలీసులు ఉన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-