తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు సీరియస్‌.. రివ్యూ పిటిషన్‌ కొట్టివేత

ట్యాంక్‌బండ్‌లో వినాయక నిమజ్జనం విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్‌ అయ్యింది హైకోర్టు.. ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టి
హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను యథావిథిగా కొనసాగించాలని, ఉత్తర్వులను మార్పులేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సంతృప్తి చెందని పక్షంలో ఛాలెంజ్ చేసుకోమని సూచించింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. తమ ఆదేశాలపై అభ్యంతరాలుంటే ఉత్తర్వులను ఛాలెంజ్ చేసుకోవాలింది. అయితే, ఈ ఒక్క ఏడాది మినహాయింపు ఇవ్వాలని కోరింది సర్కార్.. కానీ, గత ఏడాదిలోనూ నిమజ్జనంపై ఉత్తర్వులు ఇచ్చినా, ఏడాది గడిచినా పాటించలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు..

ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు.. ట్యాంక్‌బండ్‌లో వినాయక నిమజ్జనం చేసి కలుషితం చేయాలని చెప్పలేమని పేర్కొంది.. గతంలో ప్రభుత్వం మూడు కౌంటర్‌లు దాఖలు చేసిందని.. కానీ, ఇప్పటివరకు ఇబ్బందులను కోర్టు దృష్టికి తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఇబ్బందులు సెప్టెంబర్ కంటే ముందే మీ దృష్టికి వచ్చాయని అభిప్రాయపడిన ధర్మాసనం.. అన్ని ఇబ్బందులు ప్రభుత్వానికి తెలుసు.. అయినా ఎందుకు మౌనంగా ఉంటుంది అంటూ ప్రభుత్వానికి చురకలు వేసింది హైకోర్టు.

Related Articles

Latest Articles

-Advertisement-