మాసాయిపేట భూముల వ్య‌వ‌హారం.. తీర్పును రిజ‌ర్వ్ చేసిన హైకోర్టు

తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కుటుంబ‌స‌భ్యుల‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం సృష్టించాయి.. అయితే, మాసాయిపేట భూముల పై మరోసారి హైకోర్టును ఆశ్ర‌యించారు ఈటల రాజేందర్ భార్య జామున.. సర్వే నోటీస్ ఇవ్వడానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేశారామె.. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం.. తీర్పును రిజ‌ర్వ్ చేసింది.. కాగా, ఈనెల 5న సర్వే నోటీసు ఇచ్చారు అధికారులు.. ఆ నోటీసును స‌వాల్ చేస్తూ ఈట‌ల రాజేంద‌ర్ భార్య జ‌మున హైకోర్టుకు వెళ్లారు. మ‌రోవైపు.. ఈట‌ల ఫ్యామిలీ భూముల వ్య‌వ‌హారంపై ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.. పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-