హైకోర్టు కీలక ఉత్తర్వులు.. రేపటి నుంచే ప్రత్యక్ష బోధన.. కానీ..!

దాదాపు 18 నెలల తర్వాత సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ప్రత్యక్ష బోధనకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.. అయితే, దీనిపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు… ఓవైపు రేపటి నుంచి తెలంగాణలో ప్రత్యక్ష తరగతులకు అనుమతి ఇస్తూనే.. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై బలవంతం చేయవద్దన్న హైకోర్టు, విద్యార్థులు, మేనేజ్‌మెంట్‌పై ఒత్తిడి తేవద్దు.. పేరెంట్స్‌ నుంచి ఎలాంటి రాతపూర్వక హామీ తీసుకోవద్దని పేర్కొంది. కేవలం గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు స్టే విధించింది.. గురుకులాలు, విద్యాసంస్థల్లో వసతి గృహాలు తెర వద్దని హైకోర్టు ఆదేశించింది.. గురుకులాలు, హాస్టళ్లలో వసతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

స్కూళ్ల రీఓపెనింగ్‌ నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టింది హైకోర్టు.. శాస్త్రీయ ఆధారం లేకుండా స్కూళ్ల పునఃప్రారంభంపై ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్న పిటిషనర్‌.. స్కూళ్లు పునర్‌ ప్రారంభానికి అనుమతి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు.. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థులను బలవంతం చేయొద్దు.. ప్రత్యక్ష తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దు.. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవద్దు అని స్పష్టం చేసింది.. ఆన్‌లైన్ లేదా ప్రత్యక్ష బోధనపై విద్యా సంస్థలే నిర్ణయించుకోవచ్చు అని పేర్కొన్న హైకోర్టు.. ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేయాలని తెలిపింది.. వారంలోగా మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది.. పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రచారం కూడా చేయాలని సూచించింది. అయితే, గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు స్టే విధించిందిన.. గురుకులాలు, విద్యాసంస్థల్లో వసతిగృహాలు తెరవద్దని స్పష్టం చేసింది.. గురుకులాలు, హాస్టళ్లలో వసతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.. ప్రత్యక్ష బోధనపై పరస్పర విరుద్ధ లాభనష్టాలు ఉన్నాయని వ్యాఖ్యానించిన న్యాయస్థానం.. రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత ఇంకా కొనసాగుతోందని గుర్తుచేసింది.. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో మూడో దశ పొంచి ఉందని హెచ్చరికలు ఉన్నాయని.. విద్యాసంస్థలు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయని.. ప్రభుత్వం రెండింటిని సమన్వయం చేసి చూడాలని తెలిపింది హైకోర్టు..

Related Articles

Latest Articles

-Advertisement-