పాఠ‌శాల‌ల ప్రారంభంపై హైకోర్టులో విచార‌ణ

రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో జూన్ 19 వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేశారు.  ప్ర‌స్తుతం రాష్ట్రంలో సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన‌డంతో తిరిగి పాఠ‌శాల‌ల‌ను ప్రారంభించేందుకు స‌ర్కార్ ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్న‌ది. జులై 1 వ తేదీ నుంచి పాఠ‌శాల‌లు తిరిగి ప్రారంభం కాబోతున్న‌ట్టు స‌ర్కార్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.  అయితే, పాఠ‌శాల‌ల ప్రారంభంపై తెలంగాణ హైకోర్టులో కేసులు దాఖ‌ల‌య్యాయి.  దీనిపై ఈరోజు విచార‌ణ జ‌రిగింది.  

Read: ప్రామిసింగ్ గా ‘హీరో’ టీజర్!

పాఠ‌శాలల ప్రారంభంపై విద్యాశాఖ కోర్టుకు వివ‌ర‌ణ ఇచ్చింది.  అన్ని త‌ర‌గ‌తుల‌వారు హాజ‌రుకావాలా అని హైకోర్టు ప్ర‌శ్నించ‌గా, మూడు రోజుల్లో విధివిధానాలు ఖ‌రారు చేస్తామ‌ని, ఆన్‌లైన్ బోధ‌న కొనసాగుతుంద‌ని, కోర్టు అభిప్రాయాలు తీసుకొని విధివిధానాలు ప్ర‌క‌టిస్తామ‌ని విద్యాశాఖ తెలియ‌జేసింది.  వారం రోజుల్లో పూర్తి వివ‌రాలు స‌మ‌ర్పించాల‌ని హైకోర్టుకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-