ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ వివాదంపై హైకోర్టు విచారణ…

ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ వివాదంపై హైకోర్టు విచారణ జరిపింది. సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేసింది. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై ఏ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు… హెరిటేజ్ భవనం మినహా మిగతా బ్లాక్ లలో నిర్మించలేరా అని ప్రశ్నించింది. ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలిస్తోందని తెలిపిన ఏజీ ప్రసాద్… నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎన్నేళ్లు కావాలని… ప్రభుత్వం తీరు దురదృష్టకరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆస్పత్రి సైట్ ప్లాన్, గూగుల్ మ్యాప్ ఎందుకు సమర్పించ లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోవద్దు అని హైకోర్టు ప్రశ్నించగా వైద్యారోగ్య అధికారులు కరోనా నియంత్రణలో బిజీగా ఉన్నందున కొంత సమయం ఇవ్వాలని కోరారు ఏజీ. ఆస్పత్రి నిర్మాణంపై 6 వారాల్లో తుది నిర్ణయం తీసుకొని బ్లూ ప్రింట్ సమర్పించాలని… ఆస్పత్రి పూర్తిగా కూల్చి కొత్తగా నిర్మిస్తారా? కొన్ని బ్లాక్ లలో నిర్మిస్తారా చెప్పాలని హైకోర్టు ఆదేశించింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-