విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద హై అలెర్ట్…

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనతో విశాఖ ఎయిర్ పోర్ట్ దగ్గర హై అలెర్ట్ కొనదగుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకారణకు వ్యతిరేకంగా ఆర్ధిక మంత్రికి వినతులు సమర్పించాలని జెఏసీ నిర్ణయం తీసుకుంది. వందల సంఖ్యలో ఎయిర్ పోర్ట్ దగ్గరకు కార్మికులు వస్తారని ముందస్తు సమాచారం రావడంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. ఇక అక్కడికి వచ్చిన స్టీల్ ప్లాంట్ కార్మికులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ముందస్తు అనుమతి లేకపోవడంతో ఎయిర్ పోర్ట్ ఎంట్రన్స్ దగ్గరే అడ్డగిస్తున్నారు. విశాఖ ఉక్కు-మా హక్కు నినాదాలు చేస్తున్నారు కార్మికులు. ఇక ఎయిర్ పోర్ట్ కు వెళ్లే వాహనలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అనుమతి ఇస్తున్నారు.

Related Articles

Latest Articles