హెటిరో డ్రగ్స్‌లో భారీగా నగదు పట్టివేత

హెటిరో డ్రగ్స్‌ కట్టల కొద్దీ నగదు బయటపడుతూనే ఉంది . గత మూడు రోజుల నుంచి హెటిరో డ్రగ్స్‌ చేస్తున్న సోదాల్లో భారీగా నగదును ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు . ఇప్పటివరకు దాదాపు 200 కోట్ల పైచిలుకు సీజ్ చేసినట్లు సమాచారం. ఐటీ అధికారులు సీజ్ చేసిన నగదును లెక్కిస్తున్నారు. కొంత నగదును ఇప్పటికే తగ్గించి లోని కోఠి లోని ఎస్ బి ఐ బ్యాంకు కి తరలించారు. మరోవైపు హెటిరో డ్రగ్స్‌ సంబంధించి 22 చోట్ల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. హెటిరో డ్రగ్స్ సంబంధించి ప్రధాన కార్యాలయంతోపాటు 21 చోట్లా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో ఇప్పటివరకు రెండు వందల కోట్ల పైచిలుకు నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్న నగదుకు సరైన వివరాలు తో పాటుగా ఆధారాలను హెటిరో డ్రగ్స్‌ సిబ్బంది అందించకపోవడంతో దానిని సీజ్ చేశారు. ఈ సోదాలు రేపు కూడా జరిగే అవకాశం ఉంది.

: RameshVaitla

-Advertisement-హెటిరో డ్రగ్స్‌లో భారీగా నగదు పట్టివేత

Related Articles

Latest Articles