సమంత కేసులో ఏం జరగనుంది?

సినీనటి సమంత కేస్ లో వాదనలు పూర్తయ్యాయి. నేడు తీర్పు ప్రకటించనుంది కూకట్ పల్లి కోర్టు. తన వ్యక్తిగత జీవితంపై కథనాలు ప్రసారం చేసి తనపరువుకు భంగం కలిగించారని నటి సమంత కోర్టులో కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. డాక్టర్ సీఎల్ వెంకట్ రావు, సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ పై పరువు నష్టం దావా దాఖలు చేశారు.

బహిరంగ క్షమాపణతో పాటు, తనకు సంబంధించి ఆయా యూట్యూబ్ ఛానెల్స్‌లో వున్న వీడియో లింక్ లు డిలీట్ చేయాలని సమంత కోరుతోంది. ఆమె పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ కి, ఆమెకు మధ్య ఏదో ఉందంటూ యూట్యూబ్ ఛానళ్లు ప్రసారం చేశాయి. భవిష్యత్తు లో తన వైవాహిక జీవితం గురించి ఎటువంటి వీడియోలు పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరింది సమంత.

Read Also:సమంత పరువునష్టం కేసు తీర్పు వాయిదా

ఈ కేసులో ఇవాళ ఇవ్వబోయే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేసు వాదనల సందర్భంగా యూట్యూబ్ ఛానెళ్ళపై పరువు నష్టం కేసుకి బదులుగా వాటి నుంచి క్షమాపణ కోరవచ్చు కదా అని కోర్టు వ్యాఖ్యానించింది. మరి కోర్టు క్షమాపణలు చెప్పాలని తీర్పునిస్తుందా? ఈ కేసులో ఏం ట్విస్టులు ఉండబోతున్నాయి? మరి ఆ ఛానెళ్ళు ఏం చేయబోతున్నాయి?

Related Articles

Latest Articles