తనను ఎంటర్ టైన్ చేయమంటున్న ఖుష్బూ!

ప్రముఖ నటి ఖుష్బూ సైతం కొవిడ్ 19 బారిన పడింది. ఇటు నటన, అటు రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్న ఖుష్బూ ఈ మధ్యకాలంలో ఢిల్లీ కూడా చుట్టొచ్చింది. కరోనా రెండు వేవ్ లను తప్పించుకున్న తాను చివరకు దానికి దొరికిపోయానంటూ ఖుష్బూ సోషల్ మీడియాలో కొద్ది సేపటి క్రితం ప్రకటించింది. ఆదివారం సాయంత్రం వరకూ తాను నెగెటివ్ లోనే ఉన్నానని, కొద్దిగా జలుబు ఉన్న కారణంగా ఈ రోజు చేయించుకున్న పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని ఆమె తెలిపింది. తేలికపాటి కరోనా లక్షణాలు తప్పితే మరే విధమైన ఇబ్బంది తనకు లేదని, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని, మరో ఐదు రోజుల పాటు ఒంటరిగా ఉండే తనను ఎంటర్ టైన్ చేయమంటూ ఖుష్బూ సరదాగా ట్వీట్ చేసింది.

దీనికి కొద్దిసేపు ముందే ఖుష్బూ ‘పుష్ప’ మూవీ టీమ్ ను అభినందనలతో ముంచెత్తింది. ఆ సినిమా తాను చూశానని, అల్లు అర్జున్ అంకితభావం ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపించిందని తెలిపింది. సుకుమార్ దర్శకత్వ ప్రతిభ మైండ్ బ్లోయింగ్ అంటూ ప్రశంసించింది. అలానే ఫహద్ ఫాజిల్, రశ్మిక నటనతోనూ, దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతోనూ అదరగొట్టారని ఖుష్బూ తెలిపింది.

Related Articles

Latest Articles