మరోసారి తెరపైకి హీరోయిన్ లైంగిక వేధింపుల కేసు.. సీఎంకి లేఖ

చిత్ర పరిశ్రమలో వివాదాలకు కొదువ లేదు.. ఆ హీరో తనను లైంగికంగా వేధించాడని, దర్శక నిర్మాతలు తనను బెదిరిస్తున్నారని ఎవరో ఒకరు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఐదేళ్ల క్రితం సౌత్ హీరోయిన్ ఒకామెను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు కొంతమంది వ్యక్తులు. అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది. ఇక ఈ కేసులో ఎనిమిది మంది దోషులను పట్టుకున్న పోలీసులు వారందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది. ఈ దోషులలో మలయాళ స్టార్ హీరో దిలీప్ కుమార్ కూడా ఉండడం విశేషం. అయితే కొన్ని రోజులు జైల్లో ఉన్న దిలీప్ ఆ తరువాత బెయిల్ పై బయటికి వచ్చి ప్రస్తుతం సినిమాలు చేస్తున్నాడు. ఇంకా ఈ ఘటనపై కోర్టు తుది తీర్పు ఇవ్వకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే సాక్షులు దిలీప్ తారుమారు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక మరోపక్క సదురు హీరోయిన్ కూడా పెళ్లి చేసుకొని, కొత్త జీవితాన్ని ప్రారంభించింది. దీంతో ఈ కేసు ముగిసిపోయింది అనుకొనేలోపు ఆమె బాంబ్ పేల్చింది. తన కేసులో న్యాయం జరగలేదని తెలుపుతూ ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కి ఆమె లేఖ రాశారు. ఈ కేసులో మీరే నాకు న్యాయం చేయాలంటూ ఆమె విజ్ఞప్తి చేసింది.దీంతో మరోసారి ఈ కేసు సంచలనంగా మారింది. మరి ఈ కేసుపై ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Related Articles

Latest Articles