మందు బాటిల్ ముందేసుకుని నీతులు చెప్తున్న హాట్ బ్యూటీ

ప్రస్తుతం సినీ తారలు.. ఒక పక్క సినిమాలతో మరోపక్క వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక ఏవి కాకూండా సోషల్ మీడియాలో పైడ్ ప్రమోషన్స్ అని, కొలాబరేషన్స్ అని ప్రొడక్ట్స్ కి ప్రచారం చేస్తూ బాగానే ఆర్జిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్.. టోకి.. హౌస్ ఆఫ్ సుంటోరీ కంపెనీతో కొలాబరేషన్ అయ్యి జపనీస్ బ్లెండెడ్ సుంటోరీ విస్కీని ప్రమోట్ చేసింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలుపుతూ విస్కీ గురించి ప్రత్యేకమైన క్లాస్ తీసుకుంది.

విస్కీ బాటిల్.. మందు గ్లాస్.. మంచింగ్ తో సహా అమ్మడు పోజ్ ఇస్తూ హౌస్ ఆఫ్ సుంటోరీ కంపెనీతో కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. అంతే కాకుండా ఈ విస్కీ తాగడం జపాన్ లో ట్రెడిషన్ అని, టోకి అంటే జపనీస్ లో టైమ్ అని అర్థమని చెప్పుకొచ్చింది. ఈ కొత్త ఏడాది తాను జపనీస్ విస్కీతోనే మొదలుపెట్టినట్లు తెలిపింది. ఇక చివర్లో మందుబాబులకు హెచ్చరిక కూడా జారీ చేసింది. బాధ్యతగా తాగాలని , కేవలం ఇది 25 సంవత్సరాలు పైబడిన వారికే అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమ్మడిపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. మందు తాగి.. నీతులు ఎవరైనా చెప్తారు అని కొందరు.. హీరోయిన్లు కూడా మందు బాటిల్స్ తో ప్రమోషన్స్ చేస్తే తాగకుండా ఉండేవారు ఎంతమంది అని మరికొందరు కామన్స్ పెడుతున్నారు.

Related Articles

Latest Articles