రూ.2,500 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత.. ఇదే తొలిసారి..

దేశ రాజధానిలో ఢిల్లీలో భారీ ఎత్తున డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు స్పెషల్ సెల్‌ పోలీసులు.. 2,500 కోట్ల రూపాయల విలువైన 354 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.. డ్రగ్స్ రాకెట్‌కు సంబంధించిని నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.. ఈ ముఠాలో ఒకరు ఆప్ఘనిస్థాన్ జాతీయుడు. పంజాబ్ నుంచి ఒకరు, కాశ్మీర్ నుంచి ఒకరు.. మరొకరు ఢిల్లీకి చెందిన వ్యక్తి ఉన్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.. ఢిల్లీ పోలీసులు ఇంత పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుకోవడం ఇదే తొలిసారి. ఈ కేసులో పోలీసులు నార్కో- టెర్రరిజం కోణాలపై ఆరా తీస్తూ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌ నుండి ఇరాన్ నౌకాశ్రయం ద్వారా చట్టబద్ధమైన ఎగుమతి సామగ్రి మాటున డ్రగ్స్‌ను ముంబైకి పంపించారు అని అక్కడి నుంచి సరఫరా ప్రారంభమైందని స్పెషల్ సిపి నీరజ్ ఠాకూర్ తెలిపారు.. గత నెలలో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) డార్క్‌నెట్ మరియు ఆన్‌లైన్ ఫార్మసీల ద్వారా పనిచేసే డ్రగ్ రాకెట్‌ను ఛేదించింది. సైకోట్రోపిక్ మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఎన్‌సిబి ఢిల్లీ – ఎన్‌సిఆర్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులు డార్క్‌నెట్ మార్కెట్ హోస్ట్, ఇంటర్నెట్ ఫార్మసీల ద్వారా ఆర్డర్లు పొందుతున్నారు.. ఆర్డర్‌ తీసుకుని.. అనుమానం రాకుండా తమ ముఠా సభ్యుల నుంచి పంపిణీ చేస్తున్నారని చెబుతున్నారు పోలీసులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-