తన పెళ్లి గురించి హీరో విజయ్ దేవరకొండ ఏమన్నాడో తెలుసా?

టాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. అతడికి యూత్‌లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. విజయ్ నటించిన సినిమాల్లో నాలుగైదు హిట్లే ఉన్నా అతడి నటనకు అభిమానులు ఫిదా అయిపోతుంటారు. ప్రస్తుతం విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి సినిమాల ద్వారా ఆనంద్ మంచి పేరు తెచ్చుకున్నాడు. త్వరలో పుష్పక విమానం సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ నేపథ్యంలో తమ్ముడు ఆనంద్ కోసం అన్న విజయ్ రంగంలోకి దిగి పుష్పక విమానం సినిమా కోసం ప్రమోషన్ చేస్తున్నాడు.

Read Also: బాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ పీరియాడిక్ డ్రామా

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన తమ్ముడు ఆనంద్ తన కంటే ముందే పెళ్లి చేసుకుంటాడని విజయ్ చేసిన కామెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే విజయ్ ఈ మాట అన్నప్పుడు పక్కనే ఉన్న ఆనంద్ కొంత అయిష్టంగా తల ఊపినట్లు ప్రోమో వీడియోలో కనిపిస్తోంది. మరి విజయ్ చెప్పినట్లు ఆనంద్ నిజంగానే అన్న కంటే ముందు పెళ్లి చేసుకుంటాడా లేదా కేవలం ప్రమోషన్ కోసం విజయ్ ఈ వ్యాఖ్యలు చేశాడో త్వరలో విడుదలయ్యే ఇంటర్వ్యూ పూర్తి వీడియోలో తెలిసే అవకాశముంది.

Related Articles

Latest Articles