ట్రైలర్ టాక్: ‘హీరో’గారి మొదటి సినిమా కష్టాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అశోక్ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇక ఈ సంక్రాంతి బరిలో నిలబడుతున్న ఈ సినిమా ట్రైలర్ ని తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ట్రైలర్ విషయానికొస్తే.. చిన్నప్పటినుంచి హీరో అవ్వాలనుకొనే ఒక కుర్రాడు.. అతడికి సపోర్ట్ చేసే తల్లి, తిరస్కరించే తండ్రి.. వీరి మధ్యలో నలిగిపోతూనే హీరో వేషాల కోసం తిరుగుతూ ఉండే కుర్రాడికి పక్కింట్లో అద్దె కుండా హీరోయిన్ పరిచయమవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారి చివరికి హీరోయిన్ తండ్రి వద్దకు వెళ్తోంది. దీంతో హీరోకు, హీరోయిన్ తండ్రికి మధ్య గొడవ మొదలవుతుంది. ఇక వీరి మధ్యలోకి మాఫియా దిగుతుంది. ఇక చివరికి ఆ కుర్రాడు హీరోగా మారాడా..? హీరోయిన్ ప్రేమను దక్కించుకున్నాడా..? అనేది వెండితెరపై చూడాలి. కథ కొంచెం కామన్ గా ఉన్నా శ్రీరామ్ ఆదిత్య టేకింగ్ కొత్తగా ఉందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. మధ్యలో కౌ బాయ్ గా హీరో ని చూపించి సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబును గుర్తుచేశారు.

హీరోగా అశోక్ గల్లా మొదటి సినిమానే అయినా అలా ఎక్కడ ట్రైలర్ లో కనిపించలేదు. గిబ్రాన్ మ్యూజిక్ ట్రైలర్ కి ప్లస్ అని చెప్పొచ్చు. ఇక నిధి అందాలు, హీరోతో లిప్ కిస్సులు చూపించి రొమాంటిక్ యాంగిల్ ఉన్నట్లు చూపించారు. మొత్తానికి హీరో ట్రైలర్.. ట్రైలర్ లో చెప్పినట్లే యాక్షన్, రొమాన్స్, థ్రిల్లర్ మిక్స్ చేసి చూపించారు. మరి జనవరి 15 న విడుదల అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోనుందో చూడాలి.

Related Articles

Latest Articles