మోహన్ బాబు ఫ్యాన్స్ ను కెలికిన సిద్ధార్థ్!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగబోతున్న సందర్భంలో ఇటు ప్రకాశ్ రాజ్, అటు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఇద్దరూ రెండు ప్యానెల్స్ గా ఎన్నికల బరిలో దిగబోతున్నారు. ఇకపోతే… తమిళ హీరో సిద్ధార్థ్ కు మొదటి నుండి ప్రకాశ్ రాజ్ మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. కొన్నేళ్ళ క్రితం తెలుగు మీడియాకు సిద్ధార్థ్ కు మధ్య విభేదాలు తలెత్తినప్పుడు ప్రకాశ్ రాజ్ చొరవ తీసుకుని, ‘దిల్’ రాజుతో కలిసి వాటిని తొలగించే ప్రయత్నం చేశాడు. అనేక సినిమాల్లో ప్రకాశ్ రాజ్ తో కలిసి నటించిన సిద్ధార్థ్ కు ఆయనతో మంచి స్నేహబంధమే ఉంది. పైగా ఇద్దరి భావజాలం కూడా దాదాపు ఒకే రకంగా ఉంటుంది.

ఇదిలా ఉంటే… ఇటీవల ఓ నెటిజన్ సిద్ధార్థ్ వయసు గురించి పరోక్షంగా కామెంట్ చేస్తూ ‘ప్రకాశ్ రాజ్ నువ్వు క్లాస్ మెట్స్ అటగా!’ అంటూ ఓ వ్యాఖ్యని పోస్ట్ చేశాడు. దానికి సిద్ధార్థ్ ‘ఛా! అతను నా దత్తపుత్రుడు. నేనూ మోహన్ బాబు గారు క్లాస్ మెట్స్. దయచేసి మీరు వాస్తవాలను తెలుసుకోండి’ అని బదులిచ్చాడు. పైకి ఇది సిద్దార్థ్ సరదాగా ఇచ్చిన జవాబేననిపించినా… నర్మగర్భంగా మోహన్ బాబుపై ఇతగాడు సెటైర్ వేశాడనే విషయం కొందరికి అర్థమైంది. ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ను తాను బలపరుస్తున్నాడు కాబట్టి, తనను విమర్శించే వారంతా మోహన్ బాబు అభిమానులే అనే భావనతో సిద్ధార్థ్ ఉన్నాడని కొందరంటున్నారు. అందుకే ఇన్ డైరెక్ట్ గా మోహన్ బాబు వయసుపై సెటైర్ వేశాడన్నది వారి ఆలోచన. ఇంతకూ నటుడు సిద్దార్థ్ అసలు ఎంతో మీకు తెలుసా? 42 సంవత్సరాలు!!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-