విడాకుల తర్వాత నాగచైతన్య మొదటి పోస్ట్!

నాగ చైతన్య సమంత నుండి విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత మొదటిసారి ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు. దాదాపు 45 రోజుల తర్వాత అతగాడు చేసిన మొదటి పోస్ట్ ఇది. హాలీవుడ్ నటుడు మ్యాథ్యూ మెక్‌కోనాగే రాసిన ‘గ్రీన్‌లైట్స్’ పుస్తకాన్ని చదవుతున్నట్లు చెప్పకనే చెప్పాడు తన పోస్ట్ ద్వారా. జీవితం పట్ల తన దృక్పధాన్ని వివరిస్తూ ఓ జ్ఞాపకంలా మ్యాథ్యూ ఈ అప్రోచ్ బుక్ ను తీర్చిదిద్డాడు. ప్రతి ఒక్కరూ జీవితంలో ముందుకు పోవడానికి అనువైన పరిస్థితులను వివరించటానికి మ్యాథ్యూ గ్రీన్‌లైట్స్ ను ఉపయోగించాడు. ఇప్పుడు చైతన్య ఈ పుస్తకాన్ని చదువుతున్నట్లు చెప్పాడు.

‘జీవితానికి ప్రేమలేఖ.. మీ ప్రయాణాన్ని పంచుకున్నందుకు @officiallymcconaughey ధన్యవాదాలు.. ఈ పుస్తక పఠనం నాకు గ్రీన్ లైట్.. గౌరవం సార్!’ అని పుస్తకం కవర్ ఫోటో షేర్ చేస్తూ పోస్ట్ పెట్టాడు నాగచైతన్య. ఇదిలా ఉంటే త్వరలో నాగ చైతన్య హారర్ నేపథ్యంలో వెబ్ సిరీస్‌ చేయబోతున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘థ్యాంక్యూ’ సినిమా తర్వాత ఈ సీరీస్ ఆరంభం కానుంది. హారర్ సీరీస్ కి కూడా విక్రమ్ కుమార్ దర్శకత్వ వహించనుండటం విశేషం.

Related Articles

Latest Articles