బ్రేకింగ్: మహేష్ బాబు ఇంట్లో విషాదం..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం చోటుచేసుకొంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ అన్న రమేష్ బాబు కొద్దిసేపటి క్రితం మృతిచెందారు. గతకొన్ని రోజుల నుంచి కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రమేష్ బాబును చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు సమాచారం. ఇకపోతే రమేష్ కూడా హీరోగా పలు సినిమాల్లో నటించారు. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలో చిన్నప్పటి అల్లూరి సీతారామరాజుగా నటించి మెప్పించారు.

Image

“దొంగలకే దొంగలు, నీడ,సామ్రాట్” లాంటి చిత్రాలలో నటించిన రమేష్.. తమ్ముడు మహేష్ సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. మహేష్ నటించిన “అతిధి, అర్జున్, దూకుడు, ఆగడు” చిత్రాలకు రమేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. రమేష్ బాబు మృతితో ఘట్టమనేని ఇంట్లో విషాదం చోటుచేసుకుంది . అయితే మరోపక్క మహేష్ కరోనాతో పోరాడుతుండగా.. ఆయన అన్నను చూడడానికి వస్తారా..? రారా ..? అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

Latest Articles