వ్యక్తిగత దూషణలు చేయడం బాధాకరం: కళ్యాణ్ రామ్

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం బాధాకరమని హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ వ్యాఖ్యానించాడు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై హీరో కళ్యాణ్ రామ్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పాటుపడే దేవాలయం వంటిది. అక్కడ చాలా మంది మేధావులు, చదువుకున్నవారు ఉంటారు. అలాంటి గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం ఎంతో బాధాకరం. ఇది సరైన విధానం కాదు. సాటి వ్యక్తిని, మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో మహిళలను అసెంబ్లీలో అకారణంగా దూషించే పరిస్థితి ఎదురుకావడం దురదృష్టకరం. అందరూ హుందాగా నడుచుకోవాలని మనవి చేస్తున్నా’ అంటూ కళ్యాణ్ రామ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా ఇప్పటికే ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన గురించి హీరోలు నందమూరి బాలయ్య, జూ.ఎన్టీఆర్, నారా రోహిత్‌తో పాటు దగ్గుబాటి పురంధేశ్వరి, నందమూరి చైతన్యకృష్ణ వంటి వారు స్పందించారు. అరాచక రాజకీయాలకు ఇప్పటికైనా ఫుల్‌స్టాప్ పెట్టాలని వారు హితవు పలికారు.

Read Also: అసెంబ్లీ ఘటనపై స్పందించిన ఎన్టీఆర్..

Related Articles

Latest Articles