కత్రీనా, విక్కీ… ‘ఔను! వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ అంటూ గుట్టు విప్పేసిన యంగ్ హీరో!

బాలీవుడ్ గాసిప్స్ రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి చాలా రోజులుగా ఉన్న సమస్య కత్రీనా, విక్కీ కౌశల్ వ్యవహారం! వారిద్దరూ లవ్వర్స్ అంటూ రెండేళ్లుగా రచ్చ సాగుతోంది. మీడియాలో, సొషల్ మీడియాలో అంతటా మిష్టర్ అండ్ మిస్… తెగ ట్రెండ్ అవుతున్నారు. కానీ, దాదాపుగా అందరు బీ-టౌన్ సెలబ్స్ పాటించే ఆచారాన్నే ఈ క్రేజీ కపుల్ కూడా ఫాలో అవుతున్నారు. అవుననరు, కాదనరు… సైలెంట్ గా కూడా ఉండరు! అడపాదడపా ఫోటోలు బయట పెట్టటం, డిన్నర్ మీటింగ్స్ లో కలసి కనిపించటం… ఇలా రెచ్చగొడుతూ ఉంటారు. కాకపోతే, ఎట్టకేలకు క్యాట్ అండ్ విక్కీ కౌశల్ ముసుగు తీసేద్దామని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది!

కత్రీనా కైఫ్ తో విక్కీ ప్రేమ వ్యవహారం త్వరలోనే అఫీషియల్ గా బయటపడుతుందని కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ లో టాక్ వినిపించింది. కానీ, కొందరు మాత్రం విక్కీ తండ్రి ఈ లవ్ ఎఫైర్ విషయంలో సానుకూలంగా లేడని చెబుతున్నారు. ఎవరి మాట ఎలా ఉన్నా ఇప్పుడు ఇంచుమించూ క్యాట్ నయా రొమాంటిక్ కహానీ అఫీషియల్ అయిపోయినట్టే భావించాలి. ఎందుకంటే, ఇంకా లవ్ బర్డ్స్ ఇద్దరూ నోరు తెరవనప్పటికీ యంగ్ హీరో హర్షవర్దన్ కపూర్ ‘ఔను! వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ అనేశాడు. ఓ ఇంటర్వ్యూలో అనీల్ కపూర్ తనయుడు కత్రీనా, విక్కీ సరసాల గురించి గుట్టు విప్పేశాడు!
కత్రీనా, విక్కీ కౌశల్ ఎఫైర్ గురించి హర్షవర్ధన్ కపూర్ చెప్పనైతే చెప్పేశాడుగానీ… ‘’ఈ పని వల్ల నేను ఇబ్బందుల్లో పడతానేమో’’ అని అనుమానం కూడా వ్యక్తం చేశాడు.

అయితే, ‘’వాళ్లిద్దరూ తమ రొమాన్స్ విషయంలో పెద్దగా సీక్రెసీ ఏం మెయింటైన్ చేయటం లేదులే’’ అని కూడా అన్నాడు. మరి ఇప్పుడు వాట్ నెక్ట్స్? హర్షవర్ధన్ లాంటి ఓ హీరో స్వయంగా అవును అన్నాడంటే నిప్పు ఉండటం, పొగ రావటం, రేపోమాపో అగ్గిలా రాజుకోవటం నిజమేనని భావించాలి. 33 ఏళ్ల విక్కీ కంటే కత్రీనా ఆల్రెడీ మూడేళ్లు పెద్దది కాబట్టి గబగబా పెళ్లి భోజనాలు పెట్టేసినా ఆశ్చర్యమేం లేదు!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-