పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టిన ‘స్టాండప్ రాహుల్’

రాజ్ తరుణ్, వర్షా బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘స్టాండప్ రాహుల్’. ‘కూర్చుంది చాలు’ అనేది ట్యాగ్ లైన్‌. నంద కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా సాంటో మోహన్ వీరంకిని ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం చేస్తూ ఈ సినిమా నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ టీజర్ ను వర్సిటైల్ ఆర్టిస్ట్ దగ్గుబాటి రానా విడుదల చేశారు. జీవితంలో దేనికోసం ఖచ్చితంగా నిలబడని ఓ వ్యక్తి కథ ఇది. అయితే అతను నిజమైన ప్రేమలో పడితే ఆ అమ్మాయి కోసం, తన తల్లిదండ్రుల కోసం, తాను అభిమానించే స్టాండప్ కామెడీ కోసం ఏం చేశాడదన్నే ఇందులోని ప్రధానాంశం.

Read Also : అమీర్ మూవీలో తన పాత్ర రివీల్ చేసిన చై!

హీరో రాజ్ తరుణ్ తో పాటు, హీరోయిన్ వర్షా బొల్లమ్మ కూడా ఇందులో స్టాండప్ కామెడీ చేస్తుంటుంది. కానీ తాజాగా విడుదల చేసిన టీజర్ లో మాత్రం కేవలం రాజ్ తరుణ్ వర్షన్ మాత్రమే చూపించారు. ఎదుటి వాళ్ళను నవ్వించడానికి అతను పడే కష్టం, నవ్వకుండా పెదాల బిగబెట్టుకునే వారి వల్ల ఏర్పడే ఫ్రస్టేషన్ అన్నీ ఇందులో మనకు కనిపిస్తాయి. ‘వెన్నెల’ కిశోర్ వేసే పంచ్ డైలాగ్స్ కూ ఈ టీజర్ లో చోటు కల్పించారు. కీలక పాత్ర ధారులు మురళీశర్మ, ఇంద్రజ కూడా ఇందులో ఉన్నారు. రాజ్ తరుణ్ గెటప్ ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీకోసం ఈ యంగ్ హీరో చక్కని మేకోవర్ చేశాడనే చెప్పాలి. ‘స్టాండప్ రాహుల్’ చిత్రానికి స్వీకర్ అగస్తి సంగీతం అందించగా, శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్రఫర్ గా ఉన్నాడు. అయితే ఈ సినిమా విడుదలకు సంబంధించిన సమాచారం మాత్రం మేకర్స్ తెలియచేయలేదు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-