‘స్వాతిముత్యం’ గా బెల్లంకొండ గణేష్

కె. విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ‘స్వాతిముత్యం’ సినిమాను ఎవరూ మర్చిపోలేరు. ఇపుడు అదే టైటిల్ తో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. బెల్లంకొండ గణేష్ కొత్త సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేసారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.

Read Also : సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్డేట్

బెల్లంకొండ గణేశ్ కి ఇదే పరిచయ చిత్రం కానుండటం విశేషం. తొలి సినిమాకే అంత పాపులర్ అయిన టైటిల్ ని పెట్టడం సాహసంతో కూడిన వ్యవహారమే. అయితే ఇంత కాన్ఫిడెంట్ గా టైటిల్ పెట్టడంలోనే సినిమా కంటెంట్ అంత స్ట్రాంగ్ గా ఉందని తెలియచేస్తున్నట్లు అర్ధం అవుతుంది. ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు. పి.డి. ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-