సంక్రాంతి మొత్తం ఈ జంటలోనే కనిపిస్తుందే..

చిత్ర పరిశ్రమలో మోస్ట్ అడోరబుల్ కపుల్ లిస్ట్ తీస్తే ముందు వరుసలో హీరో సూర్య- జ్యోతిక జంట ఉంటారు. 2006 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పటికీ కొత్త దంపతులలానే కనిపిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం సూర్య హీరోగా, నిర్మాతగా కొనసాగుతుండగా.. జ్యోతిక సైతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇక వీరికి ఇద్దరు పిల్లలు. తమిళనాట అతిముఖ్యమైన పండగల్లో సంక్రాంతి ఒకటి. వారు కూడా సంక్రాంతాని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఇక నేడు భోగి పండగ కావడంతో సూర్య ఇంట్లో పండగ వాతావరణం మొదలయ్యింది. పండగ స్పెషల్ గా ఈ అడోరబుల్ జంట తమ అందమైన ఫోటోను షేర్ చేస్తూ అందరికి భోగీ శుభాకాంక్షలు తెలిపారు.. భోగీ మంటలు వేసి.. ఆ మంటలపై పొంగలి కాస్తూ ఈ జంట కనిపించారు. బ్లూ కలర్ కుర్తాలో సూర్య.. వైట్ కలర్ శారీ లో జ్యోతిక సింపుల్ గా ఉన్నా ఎంతో అందంగా ఉన్నారు. ఇక ఈ ఫోటో చూస్తుంటే సంక్రాంతి పండగ మొత్తం ఈ జంటలోనే ఉందని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొంతమంది ఎంత చూడముచ్చటైన జంట.. ఎల్లప్పుడూ వీరు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామని ఆశీర్వదిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక కార్తీ సైతం ఈ పండగ వేడుకల్లో పాలుపంచుకున్నారు అన్న సూర్యతో కలిసి పొయ్యి దగ్గర పొంగలి తయారుచేయడానికి హెల్ప్ చేస్తూ కనిపించాడు.

Image

Related Articles

Latest Articles