‘సూపర్ హీరో’ని కాదంటోన్న యాక్షన్ హీరో!

‘స్నేక్ ఐస్’… 2021, జూలై 23న రాబోతోన్న మరో క్రేజీ సీక్వెల్. హాలీవుడ్ లో మార్షల్ ఆర్ట్స్ కి ఉండే డిమాండ్ ఏంటో మనకు తెలిసిందే. అందుకే, ‘స్నేక్ ఐస్’ ఫ్రాంఛైజ్ జపాన్ కు సంబంధించిన నింజా సాహస కృత్యాల్ని నమ్ముకుంటుంది. త్వరలో జనం ముందుకు రానున్న లెటెస్ట్ ఇన్ స్టాల్మెంట్ పై ఫ్యాన్స్ లో చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు తగ్గట్టే ట్రైలర్ కూడా యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకుంటోంది. అయితే, ఫిల్మ్ మేకర్స్ ట్రైలర్ లో పెద్దగా స్టోరీ రివీల్ చేయలేదు.
‘స్నేక్ ఐస్’ క్యారెక్టరే ‘స్నేక్ ఐస్’ సినిమాలో హీరో! అతడికి, స్ట్రామ్ షాడో అనే మరో క్యారెక్టర్ కి మధ్య సాగే ఫ్రెండ్ షిప్, బ్రేకప్, ఆ తరువాతి హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్… ఇదే సినిమా అనుకోవచ్చు. అయితే, సాధారణంగా హాలీవుడ్ లో కనిపించే గన్నులు, బాంబులతో కూడిన వయొలెంట్ సీన్స్ కాకుండా ఇందులో హీరో, విలన్, ఇతర నటులు చేసే స్టంట్స్ మనకు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి. అందుకే, ఇది సూపర్ హీరో సినిమా కాదంటున్నాడు హీరో హెన్రీ కోల్డిండ్. ఈయన లాస్ట్ హాలీవుడ్ మూవీ ‘క్రేజీ రిచ్ ఏషియన్స్’. ఆ సినిమా సక్సెస్ ఫుల్ అవ్వటంతో ‘స్నేక్ ఐస్’ పైన కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

-Advertisement-‘సూపర్ హీరో’ని కాదంటోన్న యాక్షన్ హీరో!

Related Articles

Latest Articles