నరేష్, కరాటే కల్యాణి బెదిరిస్తున్నారు: నటి హేమ

‘మా’ ఎన్నికల వివాదం ఈసారి నటి హేమ, కరాటే కల్యాణి వంతు వచ్చింది. ఇప్పటివరకు సైలెంట్ గా వీరిద్దరూ మరో చర్చకు తెరలేపారు. తాజాగా నటి హేమ తనను నరేష్, కరాటే కల్యాణి బెదిరిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. హేమ మాట్లాడుతూ.. ‘నేను ఎవరినీ వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా అనలేదు.. నాజోలికి వస్తే మాత్రం ఊరుకోను. నన్ను నరేష్, కరాటే కల్యాణి బెదిరిస్తున్నారు. నరేష్‌, కరాటే కల్యాణి బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడుతున్నారని’ హేమ తెలిపింది.

ఈమేరకు హేమ నాలుగు యూట్యూబ్‌ చానెళ్లపై కూడా ఫిర్యాదు చేసింది.. మా ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌కు మద్దతిస్తున్నాననే బురద జల్లుతున్నారు. కరాటే కల్యాణి గురించి నేను మాట్లాడడం మొదలు పెడితే తట్టుకోలేదు. పర్సనల్‌ జీవితాలను యూట్యూబ్‌లకు ఎక్కించి క్యారెక్టర్‌ను కించపరుస్తున్నారు. నేను పొట్టిబట్టలు వేసుకున్న వీడియోలు, ఫోటోలు ఉన్నాయి అని అంటున్నారు. నా జీవితం… నా పర్సనల్.. నేను ఎలాంటి బట్టలు వేసుకుంటే మీకేంటి…? నేను ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తానో.. ఎలాంటి బట్టలు వేసుకుంటానో.. అందరికి తెలుసు.. మేము మాట్లాడేది ఒకటి… యూట్యూబ్ చానల్ హెడ్డింగ్ ఒకటి ఉంటుంది. అలాంటి చానళ్లపై చర్యలు తీసుకోవాలని కోరాను’ అంటూ నటి హేమ తెలిపింది.

-Advertisement-నరేష్, కరాటే కల్యాణి బెదిరిస్తున్నారు: నటి హేమ

Related Articles

Latest Articles