హేమ… శివబాలాజీ చెయ్యెందుకు కొరికింది!?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం మహారంజుగా జరిగాయి. మొత్తం ఎన్నికల ప్రక్రియలో నటి హేమ, శివబాలాజీ చెయ్యి కొరకడమే చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయం మీడియాలో ప్రసారం కానంత వరకూ ‘అలాంటిదేమీ లేద’ని, ఇదంతా ‘తమ ఎక్స్ గాడు (నరేష్) చేస్తున్న అతి’ అని చెప్పిన హేమ… వీడియో బయటకు రాగానే మొదట మౌనం దాల్చింది. శివబాలాజీ చేయిని హేమ కొరడం వెనుక ఆకతాయితనం కాదు ఓ ప్రధాన కారణమే ఉంది. ‘మా’ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటున్న చోట కేవలం పోటీ చేస్తున్న సభ్యులకు మాత్రమే ప్రవేశ అర్హత కల్పించారు. అయితే ప్రకాశ్ రాజ్ తరఫున ఓ నాన్ మెంబర్ ఆ ఏరియాలో ప్రచారం చేస్తున్నారని నరేశ్ టీమ్ కనిపెట్టింది. నిజానికి అతని ముఖానికి మాస్క్ ఉండటంతో వారు గుర్తించలేదు కానీ ఆ తర్వాత తెలిసింది ఏమంటే అతను ‘మా’ సభ్యుడే.

కానీ అతన్ని నరేశ్ టీమ్ చుట్టుముట్టి కొట్టబోయినప్పుడు భయంతో అతను ఆ విషయాన్ని చెప్పకుండా పారిపోయే ప్రయత్నం చేశాడట. అతన్ని ఆపడానికి శివ బాలాజీ తన చెయ్యిని బ్యారికేడ్ పట్టుకుని అడ్డంగా పెట్టాడట. ఆ వ్యక్తి బయటకు వెళ్లిపోవడానికి సహకరించడం కోసం హేమ అడ్డుగా ఉన్న శివబాలాజీ చేతిని కొరికిందని తెలుస్తోంది. ఈ హడావుడిలో హేమ తన చేతిని కొరకడాన్ని శివబాలాజీ పెద్దంతగా పట్టించుకోలేదు. సదరు వ్యక్తిని పట్టుకుని బయటకు పంపిన తర్వాత చూస్తే, చేతిపై పంటి గాట్లు కనిపించాయి.

దాంతో నరేశ్ హేమ మీద ఆగ్రహించి, ఇది బైటింగ్ టైమ్ కాదు… ఓటింగ్ టైమ్ అంటూ వ్యాఖ్యానించాడు. హేమ పంటి గాట్లు కాస్తంత గట్టిగానే దిగడంతో ఎందుకైనా మంచిదని శివ బాలాజీ హాస్పిటల్ కు వెళ్లి ఇంజెక్షన్ చేయించుకుని వచ్చాడు. అయితే… ఇలాంటి గొడవ ఏదీ జరగలేదన్నట్టుగా మొదట హేమ చెప్పినా, బయటకు వచ్చిన వీడియో గురించి చెప్పేసరికీ, తన దారికి అడ్డంగా శివ బాలాజీ చేయి పెట్టాడని, తీయమని చెప్పిన వినలేదని, దాంతో చేయి కొరికానని తెలిపింది. ఎవరైనా తనకు అడ్డంగా ఉంటే తాను అలానే చేస్తానని సమర్థించుకునే ప్రయత్నమూ చేసింది. మరి శివ బాలాజీతో పాటు ఆ పక్కనే ఉన్న అతని భార్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కంటెస్టెంట్ స్వప్నమాధురి ఈ మొత్తం వ్యహారంపై ఎలా రియాక్ట్ అయ్యిందో తెలియదు!

-Advertisement-హేమ… శివబాలాజీ చెయ్యెందుకు కొరికింది!?

Related Articles

Latest Articles