చంద్రబాబుకు ఫోన్ చేసిన సోనూసూద్

ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు పలువురు ప్రముఖులు సానుభూతి తెలుపుతున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేసి మద్దతు తెలపగా… తాజాగా హెల్పింగ్ స్టార్ సోనూ సూద్ కూడా టీడీపీ అధినేతకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన ఘటన గురించి మాట్లాడారు. శాసనసభలో జరిగిన ఘటన దురదృష్టకరమని సోనూసూద్ వ్యాఖ్యానించాడు. దేవాలయం లాంటి సభలో వైసీపీ నేతల వైఖరి సరికాదని సోనూసూద్ అభిప్రాయపడ్డాడు. హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తానని చంద్రబాబుకు సోనూసూద్ చెప్పినట్లు తెలుస్తోంది.

Read Also: చంద్రబాబు ఏడవడానికి కారణం ఆ ఫోన్ కాల్..?

కాగా గతంలో చంద్రబాబుపై సోనూసూద్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. కరోనా బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తున్న సమయంలో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో సోనూసూద్ పాల్గొని చంద్రబాబును అభినందించారు. హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను తాను ప్రత్యక్షంగా చూశానని అప్పట్లో సోనూసూద్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Related Articles

Latest Articles