అనాధల రాత మార్చే ‘గీత’గా హెబ్బా పటేల్!

వి. వి. వినాయక్ శిష్యుడు విశ్వా ఆర్. రావును దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్. రాచయ్య ‘గీత’ అనే సినిమా నిర్మిస్తున్నారు. ఈ విభిన్న కథా చిత్రానికి ‘మ్యూట్ విట్నెస్’ అనేది ట్యాగ్ టైన్. క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ హీరోగా నటిస్తుండగా ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’ చిత్రాల ఫేమ్ సాయి కిరణ్ ప్రతినాయకుడిగా పరిచయమవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను దర్శకులు వి. వి. వినాయక్ త్వరలో రిలీజ్ చేయనున్నారు. అనాథల కోసం పోరాడే మూగ యువతిగా ఓ ఛాలెంజింగ్ పాత్రను హెబ్బా పటేల్ ఇందులో చేస్తోందని, ఇతర ప్రధాన పాత్రలను రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, 30 ఇయర్స్ పృథ్వి, తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్ తదితరులు పోషిస్తున్నారని దర్శక నిర్మాతలు తెలిపారు.

Read Also : పవన్ కల్యాణ్, మంచు మనోజ్ భేటీ

-Advertisement-అనాధల రాత మార్చే 'గీత'గా హెబ్బా పటేల్!

Related Articles

Latest Articles