ఏడారి దేశంలో భారీ వ‌ర‌ద‌లు… అప్ర‌మ‌త్త‌మైన అధికారులు…

ఏడారి దేశం ఒమ‌న్‌లో గ‌త కొన్ని గంట‌లుగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  నిత్యం ఎండ‌లు, చుట్టు ఇసుక‌తో క‌ప్ప‌బ‌డిన ఒమ‌న్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో అక్క‌డి ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల‌పై న‌డుములోతులో నీళ్లు నిలిచిపోయాయి.  దీంతో వాహ‌న‌దారులు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.  అరేబియా స‌ముద్రంలో ఏర్ప‌డిన ష‌హీన్ తుఫాను కార‌ణంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్న‌ట్టు అధికారులు చెబుతున్నారు.  తుఫాన్ తీరం దాటే స‌మ‌యంలో వ‌ర్షం మ‌రిత భీభ‌త్సం సృష్టించే అవ‌కాశం ఉండ‌టంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు తీర‌ప్రాంతంలోని ప్ర‌జ‌ల‌ను అక్క‌డి నుంచి ఖాళీచేయించారు.  ఒమ‌న్ రాజ‌ధాని రాజ‌ధాని మ‌స్క‌ట్‌లో కురుస్తున్న వ‌ర్షాల‌కు ప్ర‌జ‌లు భ‌య‌ప‌డిపోతున్నారు.  ఇళ్ల‌లోనుంచి బ‌య‌ట‌కు రావాలంటే ఆలోచిస్తున్నారు.  

Read: ఆ ఎన్నిక‌ల నుంచి టీడీపీ కూడా త‌ప్పుకున్న‌ట్టేనా…!!

-Advertisement-ఏడారి దేశంలో భారీ వ‌ర‌ద‌లు... అప్ర‌మ‌త్త‌మైన అధికారులు...

Related Articles

Latest Articles