తక్షణ సాయం కింద రూ.1000 ఇవ్వాలి: జగన్‌

చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలో కుండపోత వర్షాలతో జన జీవనం అస్తవ్యవస్తమయింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు తిరుపతిలోని ఘాట్‌ రోడ్‌లో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో టీటీడీ అధికా రులు రోడ్లను మూసివేశారు. ప్రధాన కూడళ్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. చెన్నైకి ఆగ్నేయంగా 250 కిలో మీటర్ల దూరంలో ఉన్న వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, కడపలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తగిన సహాయక చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎం జగన్‌ ఆదేశించారు. సహాయ శిబిరాల్లో ఉన్న వారికి తక్షణ సాయం కింద వెంటనే రూ.1000 ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్‌. అక్కడ వారికి అన్ని రకాల వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట్ల సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. రిజర్వాయర్లు, చెరువుల్లో నీటిమట్టాలను గమనించుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలన్నారు.

Related Articles

Latest Articles