ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి… మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది… వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిమీ నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉండగా.. దాని ప్రభావంతో, వచ్చే 48 గంటలలో వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లో అల్ప పీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని.. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు కురవనున్నాయి.. ఈరోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రా లో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉండగా.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాలలో గంటకు 20 నుండి 30 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితలగాలులు వీచే అవకాశం ఉంటుందని పేర్కొంది.

ఎల్లుండి ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటినుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశంఉందని… భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.. మరోవైపు.. ఈరోజు, రేపు దక్షిణ కోస్తా ఆంధ్రలో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు.. ఇక, ఈరోజు మరియు రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల.. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటినుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-