తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన…

ఋతుపవనాలు తెలంగాణా, ఆంధ్రా రాష్ట్రలలో మెదక్, నల్గొండ, రెంటచింతల, శ్రీహరికోట వరకు (నిన్న) 6వ.తేదీన ప్రవేశించినవి. నిన్నటి నైరుతి ఋతుపవనాలు మధ్య ప్రదశ్ నుండి మరత్ వాడ , తెలంగాణ, రాయలసీమ మీదగా ఉత్తర తమిళనాడు వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈ రోజు బలహీన పడినది. ఈ రోజు ఉపరితల ద్రోణి, మరత్వాడ నుండి ఉత్తరా ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5కి మి వరకు వ్యాపించింది. అల్పపీడనం సుమారుగా 11వ తేదీన ఉత్తర బంగాళా ఖాతం & పరిసర ప్రాంతాల్లో ఏర్పడే అవకాశం ఉంది.

వాతావరణ సూచన

తేలికపాటి నుండి మోస్తరు వర్షములు ఈ రోజు (07వ.తేదీ) ఒకటి రెండు ప్రదేశములలో మరియు రేపు,ఎల్లుండి (08,09వ తేదీలు) కొన్ని ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి.

వాతావరణ హెచ్చరికలు:-

రాగల 3 రోజులు (07,08,09వ.తేదీలు) ఉరుములు మరియు మెరుపులుతో కూడిన వర్షం తెలంగాణాలోని ఒకటి, రెండు ప్రదేశములలో (ఈ రోజు,రేపు ఉత్తర, తూర్పు జిల్లాలలో) వచ్చే అవకాశములు ఉన్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-