అలర్ట్ : మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

ఏపీకి మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ ఆంధ్ర ప్రదేశ్-ఉత్తర తమిళనాడు కోస్తా తీరాలకు దగ్గరగా పశ్చిమ మధ్య & దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం లలో సగటు సముద్రమట్టానికి 1.5 km నుండి 4.5 km ఎత్తుల మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉన్నది. ఈరోజు షీర్ జోన్ (ద్రోణీి) 10°N అక్షాంశము వెంబడి సగటు సముద్రమట్టానికి 5.8 km నుండి 7.6 km ఎత్తుల మధ్య ఏర్పడింది. తేదీ 6 సెప్టెంబర్ 2021 న ఉత్తర మరియు దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం లలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-