భాగ్య‌న‌గ‌రంలో భారీ వ‌ర్షం…

భాగ్య‌న‌గ‌రంలో ఉన్న‌ట్టుండి వాతావ‌ర‌ణం మారిపోయింది.  రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో వ‌ర్షం కుర‌వ‌డం మొద‌లైంది.  ఆగ‌కుండా గంట సేపు న‌గ‌రంలోని అనేక ప్రాంతాల్లో వ‌ర్షం కురిసింది.  ఈ వ‌ర్షానికి రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి.  గంట నుంచి వ‌ర్షం కురుస్తుండ‌టంతో రోడ్లు చెరువుల‌ను త‌ల‌పిస్తున్నాయి.  ఎక్క‌డిక‌క్క‌డ ట్రాఫిక్ జామ్ అయింది.  జూబ్లీ హిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట‌, ఖైర‌తాబాద్, అమీర్‌పేట‌, కూక‌ట్ ప‌ల్లి, కేపీహెచ్‌పీ, అల్విన్ కాల‌నీ, బాలాన‌గ‌ర్‌, నాచారం, మ‌ల్లాపూర్‌, తార్నాక‌, ఉప్ప‌ల్‌లో భారీగా వ‌ర్షం కురుస్తున్న‌ది.  దీంతో లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు జాగ్ర‌త్తగా ఉండాల‌ని అధికారులు హెచ్చిరించారు.  డ్రైనేజీలు పొంగి పోర్లుతుండ‌టంతో జీహెచ్ఎంసీ అధికారులు నీటిని నాళాల గుండా పంపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  

Read: దేశంలో ఎన్ని డెల్టా ప్ల‌స్ కేసులు ఉన్నాయో తెలుసా?

Related Articles

Latest Articles

-Advertisement-