హైదరాబాద్‌లో భారీ వర్షం..

ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఆకాశం మేఘావృతమైంది. ఇప్పటికీ ఏపీ, తమిళనాడు తో పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

కొన్ని చోట్ల రోడ్లపైకి వర్షపు నీరు రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఏపీలో కూడా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Related Articles

Latest Articles