అల్పపీడనం ఎఫెక్ట్ : ఏపీకి భారీ వర్ష సూచన

ఏపీకి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నిన్నటి ఉపరితల ఆవర్తనం ప్రస్తుతము ఉత్తర బంగాళాఖాతం & దానిని ఆనుకుని వున్న తూర్పు మధ్య బంగాళాఖాతం లలో సగటు సముద్ర మట్టం నుండి 4.5 కి మీ వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్ళే కొలది నైఋతి దిశ వైపుకు వంగి కొనసాగుతున్నది. దీని ప్రభావం వలన రాగల 24 గంటలలో ఉత్తర & దానిని ఆనుకుని వున్న మధ్య బంగళాఖాతం లలో ఒక “అల్ప పీడనం” ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు షీర్ జోన్ (ద్రోణీి) 14°N అక్షాంశము వెంబడి సగటు సముద్రమట్టానికి 5.8 km నుండి 7.6 km ఎత్తుల మధ్య కొనసాగుతున్నది. వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Related Articles

Latest Articles

-Advertisement-