యూర‌ప్ విల‌విల: ఒక‌వైపు క‌రోనా…మ‌రోవైపు వ‌ర‌ద‌లు…

యూర‌ప్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  ఈ వ‌ర్షాల‌కు వాగులు, వంక‌లు, న‌దులు పొంగిపొర్లుతుండ‌టంతో వ‌ర‌ద‌నీరు యూర‌ప్‌లోని బెల్జియం, జ‌ర్మ‌నీ దేశాల‌ను ముంచెత్తింది.  ఈ వ‌ర‌ద‌ల కార‌ణంగా ఇప్ప‌టికే 200 మందికి పైగా మృతిచెందిన‌ట్టు స‌మాచారం.  వంద‌ల మంది వ‌ర‌ద‌నీటిలో కొట్టుకుపోయారని, వారి ఆచూకీ కోసం డిజాస్ట‌ర్ టీమ్‌, ఆర్మీ బృందాలు గాలిస్తున్నాయని జ‌ర్మ‌నీ అధికారులు చెబుతున్నారు.  ఈ వ‌ర‌ద‌ల ప్ర‌భావం జ‌ర్మ‌నీలోని అహాల్వ‌ర్ కౌంటీ, రైన్‌లాండ్‌-ప‌లాటినేట్‌, నార్ట్‌రైన్‌-వెస్ట్‌ఫాలియా రాష్ట్రాల్లో ఎక్కువ‌గా ఉన్న‌ది.  ఇప్ప‌టికే జ‌ర్మనీ క‌రోనా తో విల‌విల‌లాడుతున్న‌ది.  సెకండ్ వేవ్ నుంచి కోలుకుంటున్న స‌మ‌యంలో ప్ర‌కృతి సృష్టించిన ఈ వ‌ర‌దల‌తో అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు.  

Read: ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : తెలుగు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధుల మాటతీరు శృతిమించుతోందా..?

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-