ముంబాయి పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత…

ముంబాయి పోర్టు లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. 26 కేజీల హెరాయిన్ సీజ్ చేసారు ముంబాయి డీఆర్ఐ అధికారులు. ఇరాన్ చాబహార్ పోర్ట్ నుండి సముద్ర మార్గం ద్వారా కంధార్ పోర్టుకు చేరుకుంది భారీ కంటైనర్. అక్కడి నుండి ముంబయి కు చేరుకున్న భారీ కంటైనర్. గుజరాత్ తరహా ముంబయి లో డ్రగ్స్ సరఫరా సాగుతుంది అనే పక్కా సమాచారం తో దాడులు నిర్వహించింది డీఆర్ఐ బృందం. అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా డ్రగ్స్ ను నువ్వులు, ఆవ నూనె కలిపి తరలించే యత్నం చేసారు కేటుగాళ్లు.

ఇరాన్ నుండి నువ్వులు, ఆవ నూనె లోడ్ తో వచ్చిన కంటైనర్. నూనె లోడు చూసి తలలు పట్టుకున్న డీఆర్ఐ అధికారులు…. మూడు రోజుల సుదీర్ఘ విచారణ తర్వాత నూనె లో డ్రగ్స్ కలిపి నట్లు గుర్తింపు. నూనె రూపంలో లో వున్న డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్ నుండి ముంబాయి లోని మజీద్ బుందార్ చిరునామా తో వచ్చిన కంటైనర్ ఎవరిది? అక్కడ వుంటున్న వ్యక్తులు ఎవరు? దీనికి అసలు సూత్రధారులు ఎవరు అనే సమాచారాన్ని స్వేకరిస్తున్నారు డీఆర్ఐ అధికారులు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది అధికారుల బృందం.

-Advertisement-ముంబాయి పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత...

Related Articles

Latest Articles