హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ నగరంలో మరో డ్రగ్స్‌ ముఠా ఆట కట్టించారు పోలీసులు, భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది… డ్రగ్స్‌ ముఠాను నడుపుతోన్న ముంబై మాఫియాని అరెస్ట్‌ చేశారు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. ముంబై నుంచి హైదరాబాద్‌కు ఆ ముఠా డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా గుర్తించారు.. న్యూ ఇయర్ వేడుకల కోసం హైదరాబాద్‌కు భారీ ఎత్తున డ్రగ్స్ తీసుకొని వచ్చినట్టుగా తెలుస్తుండగా.. ఈ ముఠా నుంచి కొకైన్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలను సీజ్ చేశారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. ఇక, న్యూ ఇయర్ వేడుకల్లో ఈ ముఠా ఎక్కడెక్కడ డ్రగ్స్‌ సరఫరా చేసింది.. దీని వెనుక ఇంకా ఎవరున్నారు అనే విషయాలపై ఫోకస్‌ పెట్టారు పోలీసులు.

Read Also: పీఆర్సీపై కాసేపట్లో క్లారిటీ..!

Related Articles

Latest Articles