బర్డ్ ఫ్లూకి ఇలా చెక్‌ పెట్టండి !

మొన్నటి వరకు కరోనా వైరస్‌తో వణికిపోయిన ప్రజలు.. ఇప్పుడు బర్డ్‌ ఫ్లూతో భయపడుతున్నాయి. మన దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బర్డ్‌ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో పక్షుల శవాలు గుట్టల్లా పేరుకుపోతున్నాయి. భోపాల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ అనిమల్‌ డిసీజెస్‌ బర్ఢ్ ఫ్లూ ఈ మేరకు కీలక పరీక్షలు నిర్వహిస్తోంది. ఇలాంటి సమయంలో అసలు బర్డ్‌ ఫ్లూ లక్షణాలు ఏంటి? అసలు దీనికి ఎలా చెక్‌ పెట్టాలో చూద్దాం. బర్డ్‌ ఫ్లూని అవియాన్‌ ఫ్లూ అని కూడా అంటారు. హెచ్‌5ఎన్‌1 వైరస్‌ వల్ల ఈ బర్డ్‌ ఫ్లూ వ్యాపిస్తుంది. మని మనిషికి సోకితే.. ప్రాణాంతకం అవ్వవచ్చు. సరిగ్గా ఉడకకుండా తీసుకున్న గుడ్లు, మాంసం వల్ల ఇది సోకవచ్చు. అయితే.. బర్డ్‌ ఫ్లూకి చెక్‌ పెట్టేందుకు.. గుడ్డులోని పచ్చసోనా గట్టిపడే వరకు ఉడికించాలి. అలాగే మాంసాన్ని 165F ఉష్ణోగ్రతలో ఉడికించాలి.  

Related Articles

Latest Articles