చంద్రబాబుకు మద్దతుగా హెడ్‌కానిస్టేబుల్‌ రాజీనామా..

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలతో ఏపీ రాజకీయాలు భగ్గుమన్నాయి. అంసెబ్లీ సమావేశాల్లో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు టీడీపీ అధినేత చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శించారని ఆరోపణలు చేస్తూ ఏపీలో టీడీపీ శ్రేణులు నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై వైసీపీ నాయకుల మాటలను ఖండిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సదరు హెడ్‌ కానిస్టేబుల్ ఓ వీడియో విడుదల చేశారు.

తను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1998 బ్యాచ్‌లో సివిల్‌ కానిస్టేబుల్‌గా ప్రకాశం జిల్లా నుంచి టాపర్‌గా నిలిచానని, అప్పటి నుంచి ఇప్పటివరకు నిజాయితీ పనిచేశానన్నారు. ఎప్పడూ ఎక్కడా చేయిచాచకుండా విధులు నిర్వహించాననన్నారు. అయితే ఏపీలో పరిస్థితులు పోలీసులకు, ప్రజలకు తెలుసునని, అసెంబ్లీలో విలువ లేకుండా టీడీపీ అధినేతను దూషించడం సబబుకాదన్నారు. విలువలేని వారివద్ద పనిచేయలేనంటూ ఆయన ప్రజల ముందు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Related Articles

Latest Articles