బండి సంజయ్ అన్ని అబద్ధాలుమాట్లాడుతున్నారు: తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. బండి సంజయ్‌ అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గొర్రెల పంపిణీకి కేంద్రం వెయ్యి కోట్లు ఇస్తామని ఎగొట్టిందని ఆయన అన్నారు.ఆ వెయ్యి కోట్లు కూడా తెలంగాణ అప్పు తీసుకుని గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు.


బండి సంజయ్ చెప్పినట్టు కేంద్రం వెయ్యి కోట్లు సబ్సిడీ ఇవ్వ లేదు. బండి సంజయ్ బాధ్యతతో మాట్లాడాలి …పనికిరాని మాటలు వద్దన్నా రు. కేంద్రానికి దమ్ము ఉంటే దేశవ్యాప్తంగా గొర్రెల పంపిణీ చేపట్టాల న్నారు. నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొ రేషన్ నుంచి తీసుకున్న లోన్‌ను తెలంగాణ సర్కార్‌ పద్ధతి ప్రకారం చెల్లిస్తుంద న్నారు. టీఆర్ఎస్ ఎంపీల కృషితోనే రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడు తూ రాష్ర్ట ప్రజలను మోసం చేస్తున్నారని మంత్రి తలసాని ఆరోపించారు.

Related Articles

Latest Articles